Header Banner

ఇంట్లో నిమ్మచెట్టు పెంచి ఆదాయం పొందాలా! ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

  Thu Feb 20, 2025 18:25        Others

నిమ్మకాయలు.. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటిని వాడతారు. అందుకోసమే ఇంట్లోనే ఈ చెట్లని పెంచుతారు. ఈ చెట్లని పెంచేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎక్కువగా నిమ్మకాయలు కాస్తాయి. అవేంటంటే

ఆహారానికి రుచి పెంచాలన్నా, అలసిన శరీరానికి రీఫ్రెష్‌మెంట్ ఫీల్ కావాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడాలన్నా,బరువు తగ్గించాలన్నా.. ముందు వరుసలో ఉండేవాటిలో నిమ్మకాయలు కూడా ఉన్నాయి. వీటిని మనం ఎలా అయినా వాడతాం. ఇంట్లో నిమ్మకాయలు ఉంటే జ్యూస్‌లు చేసి వాడతాం. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతాం. నిమ్మ పులిహోర చేస్తాం, నిమ్మతో ఎన్నో రకాల వంటలు చేస్తాం. వీటన్నింటికోసమే చాలా మంది ఇంట్లోనే నిమ్మచెట్లని పెంచుతారు. దీంతో అవసరం ఉన్నప్పుడల్లా నిమ్మకాయల్ని కోసుకోవడానికి.అయితే, నిమ్మ చెట్లని పెంచినా కొన్నిసార్లు చెట్లకి అనుకున్నంతగా కాయలు రావు. పూత సరిగా ఉంటుంది. కాయలు ఎక్కువగా రావు. అలా కాకుండా చెట్టు నిండా నిమ్మకాయలు రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకోండి.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

చాలా మంది నిమ్మ చెట్లని నర్సరీ నుంచి తెచ్చుకుంటారు. లేదంటే పండిన పండ్ల నుంచి నిమ్మ గింజల్ని తీసి ఆరబెట్టి పెడుతుంటారు. ఎలా అయినా కూడా నిమ్మ చెట్లు నాటుకుంటాయి. అయితే వాటిని చక్కగా పెంచడానికి మరికొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. నిమ్మచెట్టుని పెంచుకోవాలనుకుంటే మనకి పెద్ద తొట్టి అవసరం. చిన్న వాటిలో చెట్లు అంత త్వరగా పెరగవు. కాబట్టి, మనకి పెద్ద తొట్టిని తీసుకోవాలి. కారణం, నిమ్మ చెట్ల వేర్లు, కొమ్మలు చాలా విస్తృతంగా పెరుగుతాయి. నేలలో నాటితే మంచివి. అలా కాకుండా తొట్టిలో నాటుకోవాలనుకుంటే పెద్ద పెద్ద తొట్టిలు అవసరం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

మనం నిమ్మ చెట్లని నేలలో నాటితే మనం వాటి చుట్టూ కాస్తా ప్లేస్ వదిలేయాలి. దీనికి కారణం వేర్లు చాలా ఎక్కువగా విస్తరిస్తాయి. కాబట్టి, చుట్టూ కాస్తా దూరం వరకూ చెట్లని నాటొద్దు. వేర్లు చక్కగా విస్తరిస్తాయి. చెట్టు సరిగా పెరుగుతుంది.

నిమ్మచెట్టుని పెంచుకోవాలనుకుంటే మనకి పెద్ద తొట్టి అవసరం. చిన్న వాటిలో చెట్లు అంత త్వరగా పెరగవు. కాబట్టి, మనకి పెద్ద తొట్టిని తీసుకోవాలి. కారణం, నిమ్మ చెట్ల వేర్లు, కొమ్మలు చాలా విస్తృతంగా పెరుగుతాయి. నేలలో నాటితే మంచివి. అలా కాకుండా తొట్టిలో నాటుకోవాలనుకుంటే పెద్ద పెద్ద తొట్టిలు అవసరం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

ఈ చెట్లు చక్కగా పెరగడానికి సహజ ఎరువులు వాడాలి. అవి ఆవు పేడ, పొటాషియం ఉన్న సహజ ఎరువులని మాత్రమే వాడాలి. 60 శాతం పిట్ నాచు, 40 శాతం కంపోస్ట్‌ని కలపండి. వీటితోనే చెట్లు చక్కగా పెరుగుతాయి. ఇంట్లో మనం వంట చేసేటప్పుడు వచ్చే వ్యర్థాలన్నింటిని కూడా వేయొచ్చు.

అదే విధంగా, కొన్ని చెట్లకి ఎండ అవసరం లేదు. కానీ, నిమ్మ చెట్లకి ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పెరుగుతాయి. కాబట్టి, ఎండ చక్కగా పడేలా చూడండి. దీంతో చెట్లు బాగా పెరుగుతాయి.గాలి కూడా వీచే ప్రదేశంలోనే చెట్లని పెంచండి. అదే విధంగా, ఈ చెట్లకి మీరు ప్రతి 2, 3 రోజులకి ఓ సారి నీరు పోయండి. ఇలా పోసినప్పుడల్లా చెట్లు చక్కగా తడిచేలా చూడండి. నీటి వల్లే చెట్లు చక్కగా పెరుగుతాయని గుర్తుంచుకోండి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #lemontree #tips #money #moneyearning #smallbusiness